గాలి మాటలు నమ్మకండి.. ప్రజలకు అందుబాటులో ఉండే వారిని ఎన్నుకోండి..

గాలి మాటలు నమ్మకండి.. ప్రజలకు అందుబాటులో ఉండే వారిని ఎన్నుకోండి..

 

  • సీపీఐ నారాయణ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గాలి మాటలు చెప్పే నాయకులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలు డివిజన్లలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారినే ఎన్నుకోవాలని సూచించారు. పార్టీలు మారుతూ అడ్రస్‌లు మార్చే వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానికంగా ఉండే వారినే ఆదరించాలన్నారు. డబ్బులు పంచే వారిని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిత్యం ఆలోచించేది కమ్యూనిస్టులేనని,సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు హేమంతరావు, ఎస్.కె.సాబీర్ పాషా, వంగా వెంకట్, భూక్యా శ్రీను, మునిగడప వెంకటేశ్వర్లు, పద్మ తదితరులు పాల్గొన్నారు.

అస్వస్థతకు గురైన నారాయణ..

రామవరంలో ప్రచారం చేస్తుండగా నారాయణ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పార్టీ నేతలు ఆయనను కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.